అలా గుడివాడ గడ్డం గ్యాంగ్ పై దాడి చేశారు – బుద్దా వెంకన్న

Monday, January 4th, 2021, 03:16:28 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పేకాట క్లబ్బులు నిర్వహణ పై ఇప్పటికే అధికార పార్టీ నేతలు, ప్రతి పక్ష పార్టీ నేతలు దారుణ విమర్శలు చేస్తున్నారు. తాజాగా తెలుగు దేశం పార్టీ కీలక నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అంటూ వ్యాఖ్యానించారు. పేకాట లో వచ్చే కమిషన్ ను, తాడేపల్లి కి తక్కువ చేసి చూపించడం, మోసం చేయడం తో డీ ఫ్యాక్టో హోమ్ మినిస్టర్ ఆదేశాల ప్రకారం గుడివాడ గడ్డం గ్యాంగ్ పై దాడి చేశారు అంటూ బుద్దా వెంకన్న సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. రాత్రి నుండి తాడేపల్లి లో సెటిల్మెంట్ జరుగుతుంది అని, కమీషన్ పెంచగానే కేసు ఉండదు ఏమి ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే బుద్దా వెంకన్న పరోక్షంగా పలువురు ప్రముఖుల పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం గా మారాయి. అయితే బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు ఆరోపణలు అని పలువురు అంటున్నారు. మరి కొందరు మాత్రం బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నారు.