వారిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

Tuesday, October 20th, 2020, 03:12:00 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ తీరు పై తెలుగు దేశం పార్టీ మొదటి నుండి వరుస విమర్శలు చేస్తూనే ఉంది. అయితే వైసీపీ నేతలు చేసే విమర్శలకి టీడీపీ కీలక నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎప్పటికప్పుడు గట్టిగానే సమాధానం ఇస్తారు. అయితే మరోమారు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి పై, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై పరోక్షంగానే బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఒక కోతి స్వయంగా కోతి సామెతలు చెప్పుకోవడం బహుశా ఎప్పుడు చూసి ఉండం అని, తండ్రి శవాన్ని పెట్టుబడిగా సంతకాలు సేకరించి దొడ్డిదారిన సీఎం అవ్వాలి అనుకున్న విషయం మరిచిపోతే ఎలా అంటూ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించి, 16 నెలల పాటు ఊచలు లెక్కపెట్టిన నాడు ఈ విలువలు గుర్తు లేవా అంటూ విజయసాయి రెడ్డి కి ప్రశ్నలను సంధించారు.బురదలో ఉన్న పందికి బురద పాండ్స్ కంపు రావడం భ్రమే అంటూ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.