బిగ్ న్యూస్: వైసీపీ నేతలకు బుద్దా వెంకన్న సూటి ప్రశ్న

Thursday, November 12th, 2020, 02:06:30 PM IST

నంద్యాల ఘటన విషయం లో వైసీపీ నేతలు టీడీపీ తీరును తప్పుబడుతూ ఘాటు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు బదులుగా తెలుగు దేశం పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తీరును ఎండగడుతూ సూటి ప్రశ్నలు వేస్తున్నారు. టీడీపీ లాయర్ వల్లే నంద్యాల ఆత్మహత్య కేసులో నిందితులకు బెయిల్ వచ్చింది అని వైసీపీ అంటోంది అని, టీడీపీ లాయర్లకు అంత శక్తి ఉంటే, అచ్చెన్నాయుదు కి బెయిల్ రావడానికి మూడు నెలలు, కొల్లు రవీంద్ర కి రెండు నెలలు ఎందుకు పడుతుంది అంటూ సూటిగా ప్రశ్నించారు.

టీడీపీ నేతలకు బెయిల్ రాకుండా నెలల తరబడి అడ్డుకొగలిగిన ప్రభుత్వం నంద్యాల నిందితుల విషయంలో పన్నెండు గంటలు కూడా ఎందుకు ఆపలేకపోయింది అంటూ మరొక ప్రశ్న వేశారు. అంతేకాక టీడీపీ లాయర్ల శక్తి పై అంత నమ్మకం ఉంటే జగన్ అవినీతి కేసుల్లో వాదించడానికి ఢిల్లీ నుండి పెద్ద పెద్ద లాయర్లను కోట్లు గుమ్మరించి తెచ్చే బదులు వీరినే పెట్టుకోండి మరి అంటూ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.