మీ ఫేక్ పార్టీ కి దమ్ముందా సాయి రెడ్డి?

Friday, December 18th, 2020, 01:54:37 PM IST

అమరావతే రాజధాని అని ఎన్నికల ముందుఊరు వాడా చెప్పి, ఎన్నికలు అవ్వగానే వైజాగ్ భూములు కొల్లగొట్టడం కోసం, ఏరు దాటాక తెప్ప తగలేసాడు మీ తుగ్లక్ అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే అందుకే అడుగుతున్నాం అని, ఇంత పెద్ద పెద్ద అక్షరాలతో అమరావతే రాజధాని అని మీ గెజిట్ లో కూడా వేసి ప్రచారం చేసి, ఇప్పుడు మూడు ముక్కలు చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందుకే దొంగ మాటలు చెప్పినందుకు , రండి రిఫరెండం కి వెళ్దాం అంటూ విజయసాయి రెడ్డి కి సవాల్ విసిరారు బుద్దా వెంకన్న. ప్రజలే తేలుస్తారు, అమరావతి రాజధాని కావాలో, మూడు ముక్కల రాజధాని కావాలో అని అన్నారు. మీ ఫేక్ పార్టీ కి దమ్ముందా సాయి రెడ్డి అంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. అయితే ప్రతి పక్ష నేతగా వ్యవహరిస్తున్న సమయం లో అమరావతే రాజధాని అంటూ వైసీపీ సాక్షి లో ప్రచురించిన పోస్ట్ ను బుద్దా వెంకన్న సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.