జగన్ రెడ్డి ఎవడి ఇంట్లో ఉంటున్నారో చెప్పే దమ్ము, ధైర్యం నీకు ఉందా?

Tuesday, September 29th, 2020, 01:10:00 AM IST


తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు గానూ, తెలుగు దేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటు గా స్పందించారు. అవినీతి బురదలో ఉన్న సజ్జల రామకృష్ణ రెడ్డి వరద గురించి మాట్లాడటం హాస్యాస్పదం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి కట్టలతో కోటలు నిర్మించే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగే సజ్జల గారు, నారా చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంటి కోసం ఆందోళన చెందటం వింతగా ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయ్యా సజ్జల రెడ్డి చంద్రబాబు గారు అద్దె ఇంట్లో ఉంటున్నారు అని, జగన్ రెడ్డి ఎవడి ఇంట్లో ఉంటున్నారో చెప్పే దమ్ము, ధైర్యం నీకు ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు. ముందు దొంగ సొమ్ముతో కట్టిన రాజ భవంతులు పేదలకు పంచి, ఆ తరువాత ఇతరులను విమర్శించండి అంటూ బుద్దా వెంకన్న ఘాటు విమర్శలు చేశారు. అయితే బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు మరొకసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో హాట్ టాపిక్ గా మారాయి. కొందరు బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు మాత్రం చంద్రబాబు నాయుడు పై విమర్శలు చేస్తున్నారు.