అధికారం అనే లైసెన్స్ వచ్చింది, ఇక వదులుతారా?

Monday, December 28th, 2020, 08:40:48 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తొలిసారి అధికారం లోకి వచ్చిన వైసీపీ పాలనా విధానం పై ప్రతి పక్ష పార్టీ వరుస విమర్శలు గుప్పిస్తుంది. ఇప్పటికే ప్రతి పక్ష పార్టీ ను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్న తరుణం లో అధికార పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు మరియు చర్యల పట్ల టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎంపీ విజయసాయి రెడ్డి పై మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లుడు లెట్స్ డూ కుమ్ముడు అన్నట్లు తయారైంది విజయసాయి రెడ్డి వ్యవహారం అంటూ సెటైర్స్ వేశారు.

అల్లుడు రోహిత్ రెడ్డి కు, మామ విజయసాయి రెడ్డి కు ఆంధ్ర ప్రదేశ్ సొంత ప్రాపర్టీ అయిపోయింది అని చెప్పుకొచ్చారు. 108 కాంట్రాక్ట్ లో అల్లుడి తో కలిసి భారీగా కొట్టేశారు అంటూ బుద్దా వెంకన్న ఆరోపించారు. అయితే ఇప్పుడు కాకినాడ సెజ్ ను మింగెయ్యడానికి అరబిందో రియల్టీ పేరుతో స్కెచ్ వేశారు అని చెప్పుకొచ్చారు. అంతేకాక తాడేపల్లి కి వెళ్లాల్సిన వాటా వెళ్తుంది అని అన్నారు. మరోపక్క మామ అల్లుళ్ల దోపిడీ కొనసాగుతుంది అని అని అన్నారు. ఇరువురి దోపిడీ కొత్తకాదు అని, గతంలో లక్ష కోట్లు కొట్టేసిన కేసుల్లో సహ నిందితుడు అల్లుడే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అధికారం అనే లైసెన్స్ వచ్చింది, ఇక వదులుతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.