ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకి బుద్దా వెంకన్న దిమ్మ తిరిగే కౌంటర్

Wednesday, December 16th, 2020, 05:35:40 PM IST

వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ కట్టడికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. 4,762 ఆరోగ్య కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి వాక్సినేషన్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

పారా సిట్మాల్, బ్లీచింగ్, వైసీపీ ఏలూరు స్పెషల్ వాటర్ కలిపి మిక్సి కొట్టి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తయారు చేసిన కరోనా మందు తమకు కూడా ఇవ్వాలని ప్రపంచ దేశాల అధినేతలు, ఫార్ములా మాకు కూడా ఇవ్వాలంటూ ప్రముఖ కంపనీ లు క్యూ కడుతున్నాయా విజయసాయి రెడ్డి గారు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు కనీసం మాస్క్ ఇవ్వలేక చేతులెత్తేసిన వాడు వాక్సిన్ ఇస్తాడు అని పగటి కలలు కంటున్నవా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీ బుర్రకి తగ్గ తప్పుడు లెక్కలు రాసుకొక ట్విట్టర్ పాట్లు ఎందుకు సాయి రెడ్డి అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.