కరోనా ట్రీట్మెంట్ ఫ్రీ అంటూ డబ్బా కొట్టాడు ఫేక్ సీఎం – బుద్దా వెంకన్న

Thursday, May 6th, 2021, 05:09:42 PM IST


కరోనా వైరస్ మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉన్న వీడియో ను తెలుగు దేశం పార్టీ నేతలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. కరోనా వైరస్ చికిత్స ఫ్రీ అంటూ సీఎం జగన్ అందులో వ్యాఖ్యలు చేశారు. అయితే దీని పై టీడీపీ నేతలు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ కీలక నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇక్కడ ఏపీ ప్రజలకు అర్దం కాకూడదు అని, ఇంగ్లీష్ లో ఒక వీడియో చేసి, కరోనా ట్రీట్మెంట్ ఫ్రీ అంటూ డబ్బా కొట్టాడు ఫేక్ సీఎం అని బుద్దా వెంకన్న అన్నారు. అయితే అది పట్టుకొని పేటియం పెద్ద కూలీలు రంగంలోకి దిగి, నేషనల్ వైడ్ డబ్బా కొట్టించారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇవన్నీ తప్పుడు వార్తలు అంటూ, అనేక ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్లు కౌంటర్ ఇచ్చారు అంటూ బుద్దా వెంకన్న అందుకు సంబంధించిన పోస్ట్ లను సోషల్ మీడియా లో జత చేశారు. అయితే జగన్ రెడ్డి నీకు దమ్ముంటే, కరోనా ట్రీట్మెంట్ ఫ్రీ, ఒక్క పైసా అవసరం లేదని, ప్రతి హాస్పిటల్ ముందు నీ సుందరమైన మొహం తో ఒక బ్యానర్ పెట్టించు అంటూ సవాల్ చేశారు. ఫేక్ ఫెలోస్, ఫేక్ పార్టీ అనేది ఇందుకే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.