పిరికిపంద చర్యలతో ఓటమిని అంగీకరిస్తాడు జగన్ – బుద్దా వెంకన్న

Monday, March 1st, 2021, 04:50:16 PM IST

ప్రతి పక్ష తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను రేణిగుంట విమానాశ్రయం లో పోలీసులు అడ్డుకోవడం పట్ల సర్వత్రా చర్చంశనీయంగా మారింది. అయితే పోలీసుల తీరును, వైసీపీ పాలనా విధానం పై తెలుగు దేశం పార్టీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ కీలక నేత బుద్దా వెంకన్న ఈ వ్యవహారం పై స్పందించారు. ప్రజా బలం ఉంటే ప్రతి పక్ష నేతను అడ్డుకోవాల్సిన పని ఏంటి జగన్ రెడ్డి అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రజలంతా మా వైపే అని ఎంత షో చేసినా, అధికారులను అడ్డుపెట్టుకొని ఎన్ని ఏకగ్రీవాలు చేసుకున్నా, పిరికిపంద చర్యలతో ఓటమిని అంగీకరిస్తాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే చంద్రబాబు నాయుడు ను అడ్డుకోవడం పట్ల వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలు ఉందని తెలిసినా చంద్రబాబు నాయుడు ఇలా చేయడం సమంజసం కాదు అని వ్యాఖ్యానించారు. అంతేకాక బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు చంద్రబాబు నాయుడు వైఖరి ను తప్పుబడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారు.