ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారో మీరే చెప్పాలి డీజీపీ గారు – బుద్దా వెంకన్న

Friday, October 16th, 2020, 04:10:51 PM IST

తెలుగు దేశం పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోమారు పోలీస్ అధికారుల పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు అంటూ సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. మాచర్ల లో, పోలీస్ స్టేషన్ పరిధిలో తన పై, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా గారి పైన దాడి చేసి వైసీపీ నేత తురకా కిశోర్ హత్యాయత్యానికి పాల్పడ్డాడు అని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.

అయితే దాడి జరిగినప్పుడు ఉన్న సీఐ సమక్షంలోనే ముద్దాయి ను ముఖ్య అతిథిగా పిలిచి స్టేషన్ లోనే ఎస్సై జన్మదిన వేడుకలు జరిపారు అంటూ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఇలా చేయడం ద్వారా ప్రజలకు ఎం సంకేతం ఇస్తున్నారో మీరే చెప్పాలి డీజీపీ గారు అంటూ సూటిగా ప్రశ్నించారు. వెంటనే సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి శాంతి భద్రతలు కాపాడాలి అని బుద్దా వెంకన్న కోరారు.