రాష్ట్రంలో మహిళలకి జరుగుతున్న అన్యాయానికి నిదర్శనం – బుద్దా వెంకన్న

Thursday, February 25th, 2021, 01:45:48 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనా విధానం పై మరోసారి తెలుగు దేశం పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లెళ్లకే రక్షణ లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతుంటే ఇక రాష్ట్రంలో మహిళల రక్షణ మిధ్యే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమోన్మాది విష్ణు వర్ధన్ రెడ్డి అనూష ను దారుణం గా హత్య చేస్తే లేని దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని స్వయం గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించడం రాష్ట్రంలో మహిళలకి జరుగుతున్న అన్యాయానికి నిదర్శనం అంటూ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే తెలుగు దేశం పార్టీ నేత బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందు నారా లోకేష్ ను ఎమ్మెల్యే గా గెలిపించుకుని మీ పార్టీ ను కాపాడుకోండి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే మరొకసారి దిశ చట్టం పై టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.