వైఎస్ షర్మిల పార్టీలోకి మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ..!

Wednesday, February 17th, 2021, 03:20:01 PM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు కీలక నేతలతో ఆమె సమావేశాలు కూడా జరుపుతున్నారు. అయితే వైఎస్ షర్మిల ప్రకటించే కొత్త పార్టీలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ చేరుతారని సమాచారం.

అయితే నేడు షఫీ హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని షర్మిల నివాసంలో ఆమెతో భేటీ కానున్నట్టు తెలుస్తుంది. పార్టీలో కార్యకర్తలను, నేతలను తన ఉత్తేజపూరిత ప్రసంగాలతో ఉత్సాహపరుస్తారని షర్మిల భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటే షర్మిల పెట్టబోయే కొత్త పార్టీకి సలహాదారులుగా మాజీ ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ ఉదయ సింహా ఉండనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సీఎంవోలో ప్రభాకర్ రెడ్డి అడిషనల్ సెక్రెటరీగా, సీఎస్‌వోగా ఉదయ సింహా పని చేశారు.