వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు బ్రేక్.. కారణం అదే..!

Tuesday, October 6th, 2020, 10:35:54 AM IST

Viveka

ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కొద్ది రోజులుగా విచారణను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న పలువురుని విచారించిన సీబీఐ మరికొంత మందిని విచారించే పనిలో నిమగ్నమయ్యింది. ఇలాంటి తరుణంలో ఈ కేసులో సీబీఐ విచారణకు బ్రేక్ పడింది.

ఈ కేసుకు సంబంధించిన విచారణ అధికారులలో పలువురుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలుస్తుంది. అయితే మొత్తం 15 మంది సీబీఐ అధికారుల బృందంలో ఏడుగురు అధికారులకు కోవిడ్‌ లక్షణాలున్నాయి. అయితే స్థానిక కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలలో ఈ అధికారులకు చికిత్స అందిస్తున్నారు. ఇక మిగిలిన సీబీఐ అధికారులు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్టు సమాచారం.