ఎస్ఈసీ నిమ్మగడ్డపై ఘాటు విమర్శలు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ..!

Saturday, February 6th, 2021, 01:06:51 AM IST


ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో అధికార పార్టీ వైసీపీకి, ఎస్ఈసీ నిమ్మగడ్డకు మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. రాజ్యాంగానికి, చట్టానికి అనుగుణంగా పంచాయతీ ఎన్నికలు జరుపుకుంటున్నామని అన్నారు. చిత్తూరు, గుంటూరు జిల్లాలో అధిక సంఖ్యలో ఏకగ్రీవాలు అయ్యాయని వాటి మీద రిపోర్ట్ పంపించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ కొంచెం తొందరపాటుగా అడిగారని భావిస్తున్నట్టు తెలిపాడు.

అయితే పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకుంటే దానిని ఆమోదించకుండా ఇలా అడ్డంకులు పెట్టడం మంచి పద్ధతి కాదని, ప్రజలు యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఎస్‌ఈసీ నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి బొత్స సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో ముడిపడి ఉందని, దీనిపై ప్రభుత్వంతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని బొత్స చెప్పుకొచ్చారు.