చంద్రబాబు బాధంతా బినామీల కోసమే.. బొత్స సీరియస్ కామెంట్స్.. !

Friday, October 23rd, 2020, 03:01:30 AM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన బొత్స బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేతలంతా ఎంతో దోచుకున్నారో రాష్ట్ర ప్రజలందరికి తెలుసని, ఐదేళ్ళు అధికారంలో ఉండి కరకట్టపై కనీసం రోడ్డు కూడా వేయలేకపోయారని మండిపడ్డారు. అసలు అమరావతి కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆయన ఆవేదన అంతా బినామీల గురించే అని అన్నారు.

అయితే జగన్ ఒక్క ఛాన్స్ అంటే అధికారమిచ్చారని, వైసీపీకి ఇదే ఆఖరి ఛాన్స్ అని చంద్రబాబు అంటున్నారని అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు జగన్ ప్రభుత్వమే ఉండాలని కోరుకుంటున్నారని అలాంటప్పుడు లాస్ట్ ఛాన్స్ ఎలా అవుతుందని అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టులో అడ్డుపడిన చంద్రబాబును ఎందుకు కమ్యూనిస్టులు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. ఇక చంద్రబాబుకు ఓపిక అయిపోయింది, వయసు అయిపోయిందని అన్నారు.