అమరావతి, పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎం కార్డులుగా వాడుకున్నారు – బొత్స

Thursday, January 14th, 2021, 01:40:41 AM IST


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నేడు మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ ప్రజలు ఎందుకు ఓడించారో చంద్రబాబుకు ఇంకా తెలియడం లేదని అన్నారు. అమరావతి, పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎం కార్డులుగా వాడుకున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం అప్పులు చేసిందని అవినీతి కోసం కాదని అన్నారు.

అయితే విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేస్తే ఎందుకు చంద్రబాబుకు ఆక్రోశమని అన్నారు. పారదర్శకత కోసమే రాష్ట్రంలో నూతన మున్సిపల్ ట్యాక్స్ విధానాన్ని తీసుకువస్తున్నామని బొత్స స్పష్టం చేశారు. చంద్రబాబు మాన్సాస్ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారని, మాన్సాస్ ట్రస్ట్‌ను ప్రభుత్వంలో కలపాలని మాజీమంత్రి అశోక్‌గజపతి 2004 కంటే ముందే ప్రభుత్వానికి లేఖ రాశారని బొత్స గుర్తుచేశారు. అయితే మాన్సాస్ ట్రస్ట్‌ను ప్రభుత్వంలో కలపవద్దన్న ఆనంద గజపతి విజ్ఞప్తితోనే ట్రస్ట్‌కు ఆనందగజపతిని చైర్మన్‌గా కొనసాగించామని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు.