దేవుడికి, రాజకీయాలకు ముడి పెట్టడం సరికాదు.. మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు..!

Sunday, September 13th, 2020, 01:45:07 AM IST


ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అంతిర్వేది రథం కాలిపోయిన ఘటనపై స్పందిస్తూ ఎలాంటి అపోహలు ఉండకూడదనే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించామన్నారు. గత టీడీపీ హయాంలో ఎన్ని ఘటనలు జరిగినా సీబీఐ విచారణకు ధైర్యం చెయ్యలేదని, అసలు రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో ఇచ్చిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. తమ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంది కనుకే ఈ కేసును సీబీఐకి అప్పచెప్పామని అన్నారు.

అయితే గత ఐదేళ్ళు ఒక్క మాట మాట్లాడని పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీక్షలు చేస్తున్నారని అన్నారు. ధర్నాలు, ఆందోళనలు అంటూ శాంతిభద్రతలకు ఆటంకం కలిగించవద్దని, దేవుడికి, రాజకీయాలకు ముడి పెట్టడం మంచిది కాదని అన్నారు ఇక ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా గురుంచి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే వెళ్లనివ్వండని అన్నారు.