వేల సంఖ్యలో కేసులు…పెరిగిన మరణాలు…మళ్ళీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్

Tuesday, January 5th, 2021, 10:25:35 AM IST

కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి ను అరికట్టడం కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ముంచుకొస్తున్న కరోనా వైరస్ స్ట్రెయిన్ మహమ్మారి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండటం తో ఆందోళన మరింత ఎక్కువగా అయింది. అయితే ప్రపంచం లో ఎక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న దేశాల్లో బ్రిటన్ ఒకట. మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తున్నాయి.అయితే ఈ మహమ్మారి ను అరికట్టడం కోసం ఇంగ్లాండ్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని బోరిస్ జాన్సన్ లాక్ డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే పలు దేశాలు లాక్ డౌన్ ను ఆయుధంగా భావిస్తూ నిర్ణయం తీసుకోగా, ఈ స్ట్రెయిన్ వైరస్ ధాటికి ఇంగ్లాండ్ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ తీసుకోక తప్పలేదు. గత మంగళవారం నాడు ఒక్కరోజే 80 వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం, భారీగా మరణాలు సంభవించడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీని సోమవారం ఒక్క రోజే 27 వేల మంది కరోనా తో ఆసుపత్రి లో చేరిన విషయాన్ని వెల్లడించారు. అయితే ప్రధాని బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయం ను పలు దేశాలు సైతం పాటించే అవకాశం ఉందని తెలుస్తోంది.