బోని కపూర్ సర్ ప్రైజ్ చేద్దామనుకుంటే, దేవుడు అలా ట్విస్ట్ ఇచ్చాడా?

Monday, February 26th, 2018, 09:03:26 AM IST

అతిలోక సుందరి శ్రీదేవికి మరణానికి ముందు ఏమి జరిగింది, అసలు ఆమె అంత హఠాత్తుగా ఎందుకు మరణించారు అనే విషయంపై ఇప్పుడు ప్రతిచోటా చర్చనీయాంశంగా మారింది. అసలు ఆమెకు ఎటువంటి హృద్రోగ సమస్యలు లేవని సంజయ్ కపూర్ అంటున్నారు. ఆమె ఎప్పుడు చాలా చలాకీగా అందరితో హాయిగా నవ్వుతూ మాట్లాడేవారని, కానీ ఇలా వున్నట్లుండి ఆమె గుండెపోటుతో మరణించడం నమ్మలేకుండా ఉన్నామని ఆయన అంటున్నారు అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే శ్రీదేవి హఠాన్మరణానికి ముందు భర్త బోనీ కపూర్ ఆమెకు ఒక సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నారట.

మేనల్లుడి వివాహం కోసం దుబాయ్ చేరుకున్న శ్రీదేవి దంపతులు అక్కడి జుమీరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో బస చేశారని తెలుస్తోంది. అయితే అదే రోజు రాత్రికి శ్రీదేవికి అద్భుతమైన డిన్నర్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేద్దామని ఆమె భర్త బోనీ భావించారట. ఈ విషయం ఆమెకు ముందే చెప్పకుండా సీక్రెట్ గా ఉంచారని, డిన్నర్‌ ప్రారంభానికి ముందు నిద్రపోతున్న ఆమెని లేపి 15 నిమిషాలపాటు మాట్లాడుకున్నారని తెలుస్తోంది.

ఆ తర్వాత ఫ్రెషప్ అయేందుకు వాష్‌రూమ్‌కు వెళ్లిన శ్రీదేవి పావుగంటైనా దాటినా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బోనీకపూర్ వాష్‌రూమ్ వద్దకు వెళ్లి తలుపు కొట్టారని, అయితే లోపలి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో బలవంతంగా డోర్ తెరవగా లోపల శ్రీదేవి బాత్‌టబ్‌లో అచేతనంగా పడి ఉండడంతో లేపడానికి ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో వెంటనే స్నేహితులను పిలిచారు. అనంతరం వైద్యులకు, పోలీసులకు సమాచారం అందించి ఆమెను హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారని, కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారన్నారు. అయితే ఈ మొత్తం జరిగిన విషయం బోనీ కుటుంబ సన్నిహితుల ద్వారా వచ్చిన సమాచారమని అంటున్నారు…