అదే జరిగితే విజయవాడ నుంచి వెళ్లిపోతా.. వైసీపీకి బోండా ఉమ సవాల్..!

Saturday, March 13th, 2021, 01:28:13 AM IST

ఏపీ అధికార పార్టీ వైసీపీపై టీడీపీ నేత బోండా ఉమ సంచలన సవాల్ చేశారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలలో వంద శాతం విజయం తమదేనని, అంతేకాదు ఏపీలో వందకు వంద శాతం మున్సిపాలిటీలు వైసీపీనే కైవసం చేసుకుంటుందని టీడీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని అన్నారు. అయితే సజ్జల చేసిన వ్యాఖ్యలకు బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు.

అయితే విజయవాడ కార్పొరేషన్‌లో సజ్జల చెబుతున్నట్టు మొత్తం డివిజన్లను వైసీపీ గెలుచుకుంటే కనుక తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని బోండా ఉమ అన్నారు. అంతేకాదు అదే జరిగితే కనుక కట్టుబట్టలతో తాను విజయవాడ నుంచి వెళ్లిపోతానంటూ బోండా ఉమ సంచలన సవాల్ చేశారు.