వైసీపీది ముమ్మాటికే కక్ష్య సాధింపే.. టీడీపీ నేత బోండా ఉమా సీరియస్..!

Tuesday, September 15th, 2020, 07:00:10 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలపై కక్షపూరిత దోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు సీరియస్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం అనేక మందిపై తప్పుడు కేసులు పెట్టిందని, అనేక మంది టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో దమ్మాలపాటి శ్రీనివాసరావు ఏజీపీగా ఉన్నారని అన్నారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో ప్రభుత్వం పాల్పడుతున్న రాజ్యాంగ, చట్ట ఉల్లంఘనలు, దౌర్జన్యాలన్నిటిపై సమర్ధవంతంగా కోర్టులో ఎదుర్కొంటూ టీడీపీ న్యాయవాదిగా పనిచేస్తున్నారని అందుకే ఆయనపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టించిందని అన్నారు. అయితే కోర్టులో ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతున్నా తీరు మార్చుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టి ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని, కొల్లు రవీంద్రపై హత్య కేసు పెట్టి జైలుకు పంపారని అన్నారు.