అమరావతిని నాశనం చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది – బోండా ఉమ

Wednesday, October 28th, 2020, 01:20:31 AM IST


ఏపీ రాజధాని అమరావతిని నాశనం చేయడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని ఈ నేపధ్యంలోనే రాజధాని రైతులకు సంకెళ్ళు వేశారని టీడీపీ నేత బోండా ఉమ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక స్థానిక ఎన్నికలపై కూడా స్పందించిన బోండా ఉమ ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికలను నిర్వహించవచ్చని అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎన్నికల కమీషన్‌కు పార్టీ అభిప్రాయం చెబుతారన్నారు.

అయితే ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని అన్నారు. ఆనాడు కరోనాకు పారాసిటమాల్‌ చాలని, ఇక కరోనాతో సహజీవనం తప్పదని మాట్లాడిన జగన్‌కు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కరోనా అడ్డు వస్తుందా అని ప్రశ్నించారు. ఆనాడు ఎన్నికల సంఘంపై ఎందుకు దాడికి తెగబడ్డారని నిలదీశారు. రాజ్ధాని అమరావతి రైతులకు తీవ్రవాదుల తరహాలో సంకెళ్ళు వేయడంపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బోండా ఉమా తెలిపారు.