దేవాలయలపై దాడి కేసును రాజకీయ కక్ష సాధింపు కేసుగా మారుస్తున్నారు – బోండా ఉమా

Saturday, January 16th, 2021, 10:50:16 AM IST

వైసీపీ అధికారంలోకి వచ్చాక దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డీజీపీ తాడేపల్లి ఆదేశాలతోనే దేవాలయలపై దాడి కేసును రాజకీయ కక్ష సాధింపు కేసుగా మారుస్తున్నారని అన్నారు. అసలైన నిందితుల లిస్ట్ పోలీసుల దగ్గర ఉన్నా వైసీపీ వత్తిడితో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. జగన్ పాలనలో ఐపీఎస్‌లు వైపీఎస్‌లుగా మారారని ఎద్దేవా చేశారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్టంలో విచ్చలవిడిగా మతమార్పిడులు జరుగుతున్నాయని, హిందూ దేవాలయాలలో కూడా మతమార్పిడులు చేస్తుండటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అనేక సార్లు కోర్టులు చీవాట్లు పెట్టినా, రాష్ట్రంలో లా & ఆర్డర్ ఎక్కడా లేకపోయిన పట్టించుకోని పోలీసులు సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను పెడితే అరెస్టులు మాత్రం చేస్తున్నారని బోండా ఉమా మండిపడ్డారు.