వైసీపీ చెప్పేవన్ని అబద్ధాలే.. బోండా ఉమా కీలక వ్యాఖ్యలు..!

Wednesday, November 25th, 2020, 03:05:34 AM IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బోండా ఉమా మండిపడ్డారు. పేదల సెంటు స్థలంపై వైసీపీ ప్రభుత్వం చెప్పినవన్ని అవాస్తవాలేనని అన్నారు. టీడీపీ కోర్టుకి వెళ్లుంటే డిసెంబరులో స్థలాల పంపిణీ ఎలా చేస్తుందని ప్రశ్నించారు. పేదల సెంటు స్థలంపై టీడీపీ కోర్టుకు వెళ్ళిందని వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని, ఈ విషయంలో టీడీపీ ఎక్కడ కోర్టుకి వెళ్లిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే కోర్టు కేసులు పేరు చెప్పి ప్రభుత్వం తన అసమర్ధతను కప్పి పుచ్చుకుందని విమర్శించారు. వైసీపీ చెబుతున్న ఒక రూపాయి ఇల్లు పెద్ద భోగస్ అని అది ఈ జన్మకు సాధ్యం కాదని అన్నారు. ఎన్నికల ముందు వైసీపీ మ్యానిఫెస్టోలో చెప్పినట్టు టిడ్కో ఇళ్లను ఎన్టీఆర్ గృహాలను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలందరు చంద్రబాబు హయాంలో కట్టిన నాణ్యమైన ఇళ్లనే కోరుకుంటున్నారని, వైసీపీ కూడా అలాంటి ఇళ్లనే కట్టివాలని బోండా ఉమా అన్నారు.