వైసీపీ నేతలకు అల్టీమేట్ సవాల్ విసిరిన బోండా ఉమా..!

Sunday, August 30th, 2020, 03:00:26 AM IST


వైసీపీ నేతలకు టీడీపీ నేత బోండా ఉమా అల్టీమేట్ సవాల్ విసిరారు. కృష్ణా జిల్లా అభివృద్ధిపై చర్చకు వైసీపీ నేతలు సిద్ధమా అని నిలదీశారు. 60వేల కోట్లతో 13 జిల్లాల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని అడ్డుకుంది మీరు కాదా అని ప్రశ్నించారు. తాము నిర్మించిన ఫ్లైఓవర్‌కు సున్నమేసి మేం నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు.

అయితే దుర్గ గుడి ఫ్లైఓవర్‌పై నడిచే అర్హత వైసీపీ నేతలకు లేదని తేల్చి చెప్పాడు. గతంలో 500 కోట్లతో విజయవాడలో డ్రైన్లు చేపట్టిన ఘనత టీడీపీదేనని స్పష్టం చేశారు. మీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై వేధింపులు, కేసులు పెడుతున్నారని రాష్ట్రంలో అసలు పాలన ఉందా? చట్టాలు పనిచేస్తున్నాయా అన్న అనుమానం ప్రజలలో కనిపిస్తుందని అన్నారు. పేకాట దందా , అక్రమ మద్యం ఇవన్ని మీకు కనిపించడం లేదా జగన్ గారు అని ప్రశ్నించారు.