స్టార్ హీరోలతో సమానంగా హీరోయిన్స్ రెమ్యునరేషన్!

Friday, June 15th, 2018, 02:36:00 PM IST

బాలీవుడ్ లో ప్రస్తుతం కొంత మంది హీరోయిన్స్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం లిమిట్ లేకుండా గ్లామర్ అందాలతో పరభాషా అభిమానులను కూడా నార్త్ బామలు బాగానే ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే బాలీవుడ్ లో హీరోయిన్స్ కూడా స్టార్ హీరోల లెవెల్లో రెమ్యునరేష్ అడుగుతున్నారు. మేము కూడా సినిమాలో సమానంగా కష్టపడుతున్నాం కావున తప్పకుండా అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేసేవారు ఎక్కువవుతున్నారు.

ఇటీవల పద్మావత్ సినిమాలో నటించిన దీపిక పదుకొనెకు 12 కోట్ల పారితోషికం ఇచ్చారట. హీరోలతో సమానంగా ఇవ్వడం బాలీవుడ్ లో ఇదే మొదటి సారి. ఇక త్వరలో ఆ స్థాయిలో ప్రియాంక చోప్రా కూడా చాలా స్ట్రాంగ్ గా రెమ్యునరేషన్ అందుకోనుంది. సల్మాన్ కథానాయకుడిగా తెరకెక్కబోయే భరత్ సినిమా కోసం అమ్మడిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నిర్మాతలు ఈ ప్రియాంకకు 14 కోట్ల వరకు రెమ్యునరేష్ ఇవ్వడానికి ఒకే చెప్పారని బాలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి. హీరోలకు దగ్గరలో పారితోషికాలు అందుకుంటున్న హీరోయిన్స్ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.