ఉపాధి హామీ పథకం లో దీపికా, జాక్వెలిన్ ఫోటోలు

Friday, October 16th, 2020, 03:31:51 PM IST

జాతీయ ఉపాధి హామీ పథకం లో మరొక గోల్ మాల్ బయట పడింది. మధ్య ప్రదేశ్ లో జిర్న్యా జిల్లా పిపర్ ఖేడా నకా పంచాయతీ లో సర్పంచ్ మరియు కార్యదర్శి కలిసి మోసానికి పాల్పడినట్లు తేలింది. బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోయిన్స్ దీపికా పడుకొనే మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫొటోలతో పథకం లబ్ది దారుల పేరిట నకిలీ జాబ్ కార్డు లని సృష్టించి భారీగా సొమ్ము చేసుకున్నారు. అయితే మెనూ డుబే జాబ్ కార్డ్ పై దీపికా పడుకొనే ఫోటో తో పనికి వెళ్లకపోయినా ముప్పై వేల రూపాయలను డ్రా చేయడం జరిగింది.

అయితే ప్రతి నెలా కూడా ఇలానే కొనసాగుతుండటం తో మరొక లబ్ది దారుని పేరిట జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫోటోను ఉపయోగించారు. అయితే ఇలా కొనసాగుతూ ఉండటం తో అసలైన లబ్ది దారులకు అన్యాయం జరగడం తో ఈ వ్యవహారం వెలుగు లోకి వచ్చింది. అధికారులు ఇలా కుమ్మక్కై చేశారు అని కార్మికులు సైతం వాపోతున్నారు. ఈ ఘటన పై పంచాయతీ రాజ్ సీఈఓ గౌరవ్ బెనల్ విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి అని తెలుస్తోంది.