వీడిన ఎయిర్ ఏషియా బ్లాకు బాక్సు రహస్యం!

Wednesday, January 21st, 2015, 06:18:05 PM IST


గతేడాది చివర్లో ఇండోనేషియా నుండి సింగపూర్ వెళ్తూ మార్గం మధ్యలో జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం బ్లాక్ బాక్స్ ను విశ్లేషణకు పంపిన సంగతి తెలిసిందే. అయితే దీనిని విశ్లేషించిన పేరు వెల్లడించడానికి ఇష్టపడని విచారణాధికారి ఒకరు విమాన ప్రమాదం గురించి గుండెలు పిండే నిజాన్ని తెలిపారు. కాగా విమానం కూలిపోబోతోందని అందులో ఉన్న ప్రయాణీకులందరికీ ముందే తెలుసునని ఆయన తెలిపారు. అలాగే ఫ్లైట్ కూలిపోబోతోందని పైలెట్ పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారని, అందుకే అందులో కొందరు లైఫ్ జాకెట్లను వేసుకున్నారని ఆయన వివరించారు. ఇక విమానాన్ని స్థిరంగా ఉంచేందుకు పైలెట్లు ఎంతో కృషి చేశారని అయినా ఫలితం లేకపోయిందని ఆ అధికారి తెలిపారు. కాగా బ్లాక్ బాక్స్, ఫ్లైట్ డేటా రికార్డర్ల విశ్లేషణా నివేదిక వచ్చే వారం ప్రభుత్వానికి అందజేయనున్నారు.