షాక్ : బిజెపి దెబ్బకు ‘పద్మావతి’ బలి..!

Thursday, November 2nd, 2017, 09:36:20 PM IST


బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం ‘పద్మావతి’కి భారీ షాక్ తగిలింది. ఈ చిత్రంలో రాణి పద్మావతి పాత్రని వక్రీకరించే విధంగా చిత్రీకరించారని బిజెపి ఆరోపిస్తోంది. ఈ చిత్ర విడుదల అడ్డుకోవాలంటూ కేంద్ర సెన్సార్ బోర్డు మరియు ఎన్నికల సంఘాలకు బిజెపి నేతలు లేఖ రాయనున్నారు. చిత్రీకరణ దశలోనే ఈ చిత్రపై రెండు సార్లు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా వివాదం రేగడంతో ఈ చిత్రం చిక్కుల్లో పడ్డట్లైంది. పద్మావతి విడుదల విషయంలో సంధిగ్దత నెలకొని ఉంది.

క్షత్రియుల మనోభావాల్ని కించపరిచేలా ఈ చిత్రంలో పద్మావతి పాత్రని మలిచారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. మహా రాణి పద్మావతికి, ఆక్రమణకు పాల్పడిన సుల్తాన్ ఖిల్జీ కి మధ్య ఎఫైర్ నడిచినట్లు ఈ చిత్రంలో చరిత్రని వక్రీకరించారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం తేలేవరకు చిత్ర విడుదలని ఆపివేయవల్సిందిగా బిజెపి నేతలు సెన్సార్ బోర్డుకు లేఖ రాయాలని నిర్ణయించారు. కాదని విడుదల చేస్తే దాడులు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడుతుందో అనే ఆసక్తి నెలకొని ఉంది. కాగా ఈ చిత్రంలో దీపికా పదుకొనె టైటిల్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే తమిళ చిత్రం మెర్సల్ కి బిజెపి నేతలకు మధ్య జరిగిన వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.