పేదల ఆరోగ్యమంటే కేసీఆర్ కు అంత నిర్లక్ష్యమా – బీజేపీ తెలంగాణ

Monday, May 17th, 2021, 12:58:02 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి భారిన పడి రోజు పదుల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వైద్యం పట్ల ప్రతి పక్ష పార్టీ నేతలు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బీజేపీ తెలంగాణ సోషల్ మీడియా ద్వారా అధికార తెరాస పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ లో ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని ఏడాది క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అని గుర్తు చేశారు. అయితే 30 డిసెంబర్ 2020 న ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు కానీ, ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అంటూ బీజేపీ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

పేదల ఆరోగ్యం అంటే సీఎం కేసీఆర్ కి అంత నిర్లక్ష్యమా అంటూ నిలదీసింది. అయితే ఇప్పటికే ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్ సైతం ఆయుష్మాన్ భారత్ మరియు ఆరోగ్య శ్రీ ల పట్ల అధికార పార్టీ తెరాస తీరును ఎండగడుతూ వరుస విమర్శలు చేస్తోంది. అయుష్మాన్ భారత్ ను తెలంగాణ లో అమలు చేయాలని, లేదంటే కరోనా వైరస్ చికిత్స ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలి అంటూ కాంగ్రెస్ నేతలు మరొక పక్క డిమాండ్ చేస్తున్నారు. అయితే దీని పై అధికార పార్టీ కి చెందిన తెరాస నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.