తెలంగాణ బీజేపీ కి మరొక షాక్…రాజీనామా చేసిన సీనియర్ నేత

Sunday, November 1st, 2020, 07:00:06 PM IST

తెలంగాణ రాష్ట్రం లో తెరాస కి ప్రతి పక్ష పార్టీ లు అంటే అది బీజేపీ మరియు కాంగ్రెస్ లు అని చెప్పాలి. అయితే ఇప్పటికే అధికార పార్టీ పై వరుస విమర్శలు చేస్తున్న బీజేపీ కి గట్టి షాక్ తగిలింది అని చెప్పాలి. బీజేపీ కి చెందిన సీనియర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి పార్టీ కి రాజీనామా చేశారు. పార్టీ తీరు పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు కి తన రాజీనామా లేఖ ను పంపించారు. అయితే అతని అనుచరులతో పాటుగా, కార్యకర్తలు, తాను నేడు తెరాస లో చేరానున్నారు.

అయితే ఇప్పటికే బీజేపీ లోని పలువురు నేతలు అటు తెరాస, ఇటు కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. ఈ నేపధ్యంలో కీలక నేత శ్రీధర్ రెడ్డి పార్టీ ను వీడడం తెలంగాణ బీజేపీ కి గట్టి దెబ్బే అని చెప్పాలి. గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసి, తెరాస అభ్యర్థి చేతిలో ఓటమి పాలు అయ్యారు. అయితే నేడు తెరాస లోకి చేరనున్నట్లు సమాచారం.