తెలంగాణ బీజేపీ గ్రేటర్ మేనిఫెస్టో రిలీజ్.. హామీలు ఇవే..!

Thursday, November 26th, 2020, 03:27:19 PM IST

గ్రేటర్ ఎన్నికలకు ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు తమ తమ మేనిఫెస్టోలను రిలీజ్ చేశాయి. అయితే తాజాగా నేడు బీజేపీ కూడా మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తెలంగాణ బీజేపీ కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ మేనిఫెస్టోను రూపొందించామని ఫడ్నవిస్ అన్నారు. దేశమంతటికీ 1947లో స్వాతంత్రం వస్తే హైదరాబాద్‌ సంస్థానానికి మాత్రం 1948 సెప్టెంబరు 17న వచ్చిందని అందుకే ఆ రోజున తెలంగాణ అధికారిక విమోచన దినోత్సవాన్ని జరుపుతామని ప్రకటించారు.

ఇక అన్ని పార్టీల కంటే కాసింత ఎక్కువగానే ప్రజలకు బీజేపీ వరాలు ప్రకటించింది. గ్రేటర్ వరదల్లో నష్టపోయిన వారికి రూ.25 వేల ఆర్థిక సాయాన్ని నేరుగా అకౌంట్లలోనే వేస్తామని తెలిపింది. పేదలకు వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, ఉచితంగా మంచి నీటి సరఫరా, బస్సులు మరియు మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది.

బీజేపీ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు:

 •  వరదల్లో నష్టపోయిన వారికి 25 వేల రూపాయలు
 • నివాస ప్రాంతాల్లో అందరికీ 24 గంటలు ఉచితంగా మంచినీరు
 •  మహిళలకు బస్సులు, మెట్రోలో ఉచిత ప్రయాణం
 • ప్రధానమంత్రి అవాస్ యోజన కింద అందరికి గృహ నిర్మాణాలు
 • పేదలకు 100 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్
 •  మహిళల కోసం కిలోమీటర్‌కి ఒక టాయిలెట్
 •  10 వేల కోట్లతో మూసి ప్రక్షాళన
 • సుమేధ చట్టం ద్వారా నాలల నిర్మాణం, అక్రమ కట్టడాలు కూల్చివేత
 • GHMC కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత
 •  GHMC లో 28 వేల కొత్త నియామకాలు
 • 100 గజాల్లోపు ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా అనుమతి
 • ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ