రాజకీయాలు కేవలం ఎన్నికల సమయం లో మాత్రమే చూడాలి – సోము వీర్రాజు

Wednesday, August 12th, 2020, 02:45:51 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కొత్త రాజకీయాలకు తెర లేపారు. ప్రజా సమస్యల పైనే దృష్టిని సారిస్తూ, ప్రజా క్షేత్రంలో దూసుకుపోయే విధంగా పక్క ప్రణాళిక తో దూసుకుపోతున్నారు. అధ్యక్ష పదవి చేపట్టిన కొద్ది రోజుల నుండే రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రాజకీయాల నుద్దేసిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాలు కేవలం ఎన్నికల సమయం లో మాత్రమే చూడాలి అని తెలిపారు.మిగతా కాలం రాష్ట్రం గురించి, పేదల గురించి ఆలోచించాలి అని సోము వీర్రాజు అన్నారు. కానీ ఈ కుటుంబ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజకీయాలు చేస్తుంటాయి అంటూ పరోక్షంగా తెలుగు దేశం పార్టీ, వైసీపీ ల పై ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికే ఈ రెండు పార్టీలను ఉద్దేశిస్తూ మీడియా ఎదురు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ కాగా, మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు.