గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా ఇదే..!

Friday, November 20th, 2020, 12:10:53 AM IST


దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిచి ఊపు మీదున్న బీజేపీ ఇప్పుడు గ్రేటర్ మేయర్ పీటంపై కన్నేసింది. ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్న బీజేపీ తమ అభ్యర్థుల రెండో జాబితాను కూడా రిలీజ్ చేసింది. నిన్న 21 మందితో మొదటి జాబితా రిలీజ్ చేసిన బీజేపీ తాజాగా 19 మందితో రెండో జాబితాను ప్రకటించింది. అయితే నామినేషన్లకు రేపు ఒక్కరోజే గడువు ఉండడంతో ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం లోపు మిగతా అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

బీజేపీ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా

1) ఘాన్సీబజార్- రేణుసోని
2) జియాగూడ- బోయిని దర్శన్
3) మంగళ్‌హాట్- శశికళ
4) దత్తాత్రేయనగర్‌- ధర్మేంద్రసింగ్
5) జంగంమెట్-కె.మహేందర్‌
6) గోల్కొండ- పాశం శకుంతల
7) గుడిమల్కాపూర్- దేవర కరుణాకర్‌
8) జాంబాగ్- రూప్ దారక్
9) నాగోల్- చింతల అరుణ యాదవ్
10) మన్సూరాబాద్- కొప్పుల నర్సింహారెడ్డి
11) హయత్‌నగర్‌- కళ్లెం నవజీవన్‌రెడ్డి
12) బీఎన్‌రెడ్డి నగర్‌- లచ్చిరెడ్డి
13) చంపాపేట్‌- వంగ మధుసూదన్‌రెడ్డి
14) లింగోజిగూడ- ఆకుల రమేష్‌గౌడ్
15) కొత్తపేట్- ఎన్‌.పవన్‌ కుమార్‌ ముదిరాజ్
16) చైతన్యపురి- రంగా నర్సింహ గుప్తా
17) సరూర్‌నగర్‌- ఆకుల శ్రీవాణి
18) ఆర్కే పురం- రాధా ధీరజ్‌రెడ్డి
19) మైలార్‌దేవ్‌పల్లి- తోకల శ్రీనివాస్‌ రెడ్డి