పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ..!

Monday, February 15th, 2021, 03:09:43 PM IST

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దుబ్బాక ఉపఎన్నికలో విజయం సాధించి, గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది.

అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా స్థానానికి ప్రస్తుత ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరునే ఫైనల్ చేయగా, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల స్థానానికి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఇదిలా ఉంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా రాములు నాయక్ బరిలో నిలవగా, అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్నారెడ్డి పోటీలో ఉండగా, టీఆర్ఎస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.