ఫోన్ ట్యాపింగ్ విషయం రాజకీయ అంశం – బీజేపీ ఎంపీ

Wednesday, August 19th, 2020, 12:18:06 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం పై ఇప్పటికే అధికార పార్టీ, టీడీపీ లు ఒకరి పై మరొకరు విమర్శలు చేస్తుండగా, బీజేపీ నేతలు సైతం ఈ వ్యవహారం పై స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ జివీఎల్ నరసింహ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు తీరు పై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమాల కేసు కి సంబంధించి గిన్నిస్ బుక్ రికార్డ్ లెవల్లో స్టే ఎందుకు కొనసాగుతుంది అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో ప్రధాని కి చంద్రబాబు లేఖ రాసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం లో కేంద్రం జోక్యం చేసుకోదు అని ఎంపీ స్పష్టం చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో జడ్జి లకు చంద్రబాబు సహకారం లేదు అని తెలిపారు. అయితే కోర్టులకు ఈ విషయం లో సంపూర్ణ అధికారాలు ఉన్నాయి అని, ఫోన్ ట్యాపింగ్ విషయం రాజకీయ అంశం అని అన్నారు. అయితే ప్రధానికి రాసిన లేఖ లో ఎవరి ఫోన్ ట్యాప్ అయిందో చంద్రబాబు రాయలేదు అని అన్నారు. కేంద్రం కొన్ని అంశాల్లో మాత్రమే జోక్యం చేసుకుంతుంది అని అన్నారు.