మోడీ చెప్పారనీ.. !

Monday, April 20th, 2015, 05:48:45 PM IST


ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కాలుష్యం తగ్గించేందుకు, స్వల్ప దూరాలు వెళ్లేందుకు సైకిల్ ను వాడాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని సూచనను రాజస్తాన్ ఎంపీ అర్జున్ రామ్ మేఘ్వాల్ తు. చ. తప్పకుండా పాటిస్తున్నారు. ఇక బికనీర్ లోక్ సభ స్థానం నుండి ఎన్నికైన మేఘ్వాల్ ప్రధాని మోడీ మాటను గౌరవిస్తూ సోమవారం పార్లమెంటుకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు.

కాగా మొదట మేఘ్వాల్ చర్యకు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసినా అటుపై ఆయనను అభినందించారు. ఇక సైకిల్ తొక్కడం ద్వారా వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గించినవారమవుతామని, అందుకే సైకిల్ తొక్కాలని నిర్ణయించుకున్నానని అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. మరి మోడీ చెప్పారని ఆయన మాటను శిరసా వహించిన ఈ ఎంపీ వాతావరణంలో కాలుష్యం తగ్గించేందుకు సైకిల్ తోక్కడమే సరైన మార్గమని పేర్కొంటున్నారు.