తిరుపతి ఉపఎన్నికలో జనసేనతో కలిసి పోటీ చేస్తాం – బీజేపీ ఎంపీ

Monday, December 14th, 2020, 12:01:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తిరుపతి లో ఉప ఎన్నిక విషయం లో ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే ఈ విషయం పట్ల బీజేపీ ఎంపీ జివీఎల్ నరసింహ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జన సేన పార్టీ తో కలిసి పని చేస్తామని తెలిపారు. ఢిల్లీ లో రైతుల ఆందోళన వెనుక కొన్ని పార్టీల కుట్ర ఉన్నదని పేర్కొన్నారు. అయితే దేశం లోని రైతులకు మంచి చేయాలనే స్వామినాథన్ కమిటీ వేసి సంస్కరణలు తీసుకొచ్చాం అని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోరే ఏకైక ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో నీ ప్రతి పక్ష పార్టీ, తెలుగు దేశం పై నిప్పులు చెరిగారు.

మార్కెట్ యార్డుల్లో దళారీ వ్యవస్థ ను కొనసాగించాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే వారి ఆర్ధిక లాభం కోసం చట్టాలను వెనక్కి తీసుకొని రావాలి అంటున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లో తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అయితే దేవాలయాలు దండగ అన్న మహానుభావుడు చంద్రబాబు అంటూ సెటైర్స్ వేశారు. ఆయన కూడా హిందూయిజం గురించి మాట్లాడుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకి ప్రతి పక్ష పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.