సీఎం కేసీఆర్‌పై మండిపడ్డ బీజేపీ ఎంపీ.. ఏమన్నాడంటే..!

Thursday, June 4th, 2020, 02:15:12 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో గడిచిన ఆరేళ్ళలో కుటుంబపాలన తప్పా ఏమీ లేదని అన్నారు. కేసీఆర్ మంత్రివర్గాన్ని గొర్రెల మందతో పోలుస్తూ ఎద్దేవా చేశారు.

అయితే సీ ఓటర్‌ సర్వేలో సీఎం కేసీఆర్ 16వ స్థానంతో పాతాళానికి పడిపోయారని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 30 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని ధ్వజమెత్తారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్, తన ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని మండిపడ్డారు.