షర్మిల పార్టీ హల్లేలూయా పార్టీ.. బీజేపీ ఎంపీ అర్వింద్ కామెంట్స్..!

Sunday, February 21st, 2021, 12:20:30 AM IST

తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్న నేపధ్యంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని షర్మిల అంటున్నారని అయితే తెలంగాణకు కావాల్సింది రాజన్న రాజ్యం కాదని, రామ రాజ్యమని అన్నారు. షర్మిల పార్టీ హల్లేలూయా పార్టీ అని, అనవసరంగా ఆమె సమయం వృథా చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురు కీలక నేతలతో ఆమె సమావేశాలు కూడా జరుపుతున్నారు. అయితే తాజాగా నేడు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల అభిమానులతో ఆమె సమావేశమయ్యారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నదే నా ఆకాంక్ష అని ఆమె మరొసారి చెప్పుకొచ్చారు.