బిగ్ న్యూస్: ఈ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీతోనే బీజేపీ కి పోటీ…తెరాసతో కాదు!

Friday, November 20th, 2020, 08:50:34 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరం మొదలైంది. దుబ్బాక ఉపఎన్నిక విజయం తో జోరు మీద ఉన్న బీజేపీ ల, గ్రేటర్ ఎన్నికల్లో కూడా తన సత్తా చూపేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తోనే తమకు పోటీ అని, తెరాస తో కాదు అని తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం పరిహారం ఇస్తుంటే బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది అని తెరాస తీరును ఎండగడుతూ ఘాటు విమర్శలు చేశారు.

అయితే తెరాస పాలన పై ఎంపీ అర్వింద్ ఘాటు విమర్శలు చేశారు. మజ్లిస్ తో దోస్తీ చేస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ముస్లిం లకి ఏం చేశారో చెప్పాలి అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే కేంద్రం తో యుద్ధం ప్రకటించాలి అంటే కేసీఆర్ ముందుగా ఫామ్ హౌస్ నుండి బయటికి రావాలి అంటూ సెటైర్స్ వేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా తెరాస కనుసన్నల్లో నడుస్తోంది అని ఎంపీ ఆరోపించారు. అయితే ఈ విషయం లో కొంతమంది అధికారుల పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతేకాక కమిషనర్లను బదిలీ చేయమని లేఖ రాస్తామని అన్నారు. ఎన్నికల్లో బీజేపీ ను అణచివేయాలని పోలీసులు ప్రయత్నిస్తే ఊరుకోం అని హెచ్చరికలను జారీ చేశారు.