మేయర్ ఎన్నికతో వారి చీకటి ఒప్పందం బయట పడింది – బీజేపీ ఎంపీ

Thursday, February 11th, 2021, 03:27:23 PM IST

తెలంగాణ రాష్ట్రం లో అధికార పార్టీకి, మజ్లిస్ పార్టీ అయిన ఎం ఐ ఎం పార్టీ కి గతంలో పొత్తు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మరొకసారి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి కి సంబందించి మరొకసారి ఈ రెండు పార్టీలు హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ కి చెందిన కీలక నేత, ఎంపీ ధర్మపురి అరవింద్ మేయర్ ఎన్నిక పట్ల పలు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మేయర్ ఎన్నిక తో అసదుద్దీన్ ఓవైసీ మరియు సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం బయట పడింది అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు.మేయర్ ఎన్నిక విషయంలో ఎం ఐ ఎం పోటీ చేయకుండా అధికార పార్టీ తెరాస కి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెరాస అభ్యర్ధి గద్వాల్ విజయలక్ష్మి కి మద్దతు తెలపడం పట్ల విమర్శలు చేశారు.

అయితే రాబోయే ఎమ్మెల్సీ మరియు నాగార్జున సాగర్ ఉపఎన్నిక లలో బీజేపీ గెలుపు తథ్యం అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక గిరిజనులను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల ను ఖండించారు. అంతేకాక మీటింగ్ కి వచ్చిన మహిళలను కుక్కలతో పోలుస్తావా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పడు అంటే అది పెద్ద జోక్ అని, కేసీఆర్ అవినీతి పుట్ట అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.