రాష్ట్రంలో 1.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి – బీజేపీ ఎంపీ

Wednesday, December 16th, 2020, 10:36:33 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పుంజుకున్న విషయాన్ని ఎంపీ సాయం బాపూరావు అన్నారు. అయితే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 50 వేల ఉద్యోగాలను ప్రకటించారు అని ఘాటు విమర్శలు చేశారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో తెరాస ఓటమి నీ సీఎం కేసీఆర్ సహించలేక అయోమయం సృష్టిస్తున్నారు అని అన్నారు. ఎక్కడ అవినీతి బయట పడుతుందొ అన్న భయం సీఎం కేసీఆర్ కి పట్టుకుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు అన్న నినాదం సొంత కుటుంబానికే దక్కాయి తప్ప మరొకరికి దక్కలేదు అని అన్నారు. అయితే 50 వేల ఉద్యోగాలు ప్రకటించిన నేపద్యం లో 1.5 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆది వాసులను మోసం చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.