చంద్రబాబు కి ప్రజల మద్దతు లేదు – బీజేపీ ఎంపీ

Wednesday, March 10th, 2021, 05:30:54 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు కి ప్రజల మద్దతు లేదు అని వ్యాఖ్యానించారు. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కొంతమంది ఉద్దేశ పూర్వకంగానే అసత్య ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. కుట్ర పూరితంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు తమను కాపాడతారు అన్న భావన లో ఆంధ్రజ్యోతి ఉందని విమర్శించారు.

అయితే చంద్రబాబు అధికారం లో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి ది ఒక మాట, ఓడిన తర్వాత మాట మార్చింది అంటూ చెప్పుకొచ్చారు.కులాల, మతాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదు అని సుబ్రహ్మణ్య స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు కి ప్రజల మద్దతు లేదు అని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ ఎంపి చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.