అందుకే సీఎం జగన్ పర్యటన రద్దు – బీజేపీ ఎంపీ సీఎం రమేష్

Sunday, April 11th, 2021, 06:47:35 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రతి పక్ష పార్టీ నేతలు అధికార పార్టీ పై వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం కారణం చేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభను రద్దు చేసినట్లు వైసీపీ నేతలు తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే సభను రద్దు చేసుకోవడం పట్ల ఇప్పుడు ప్రతి పక్ష పార్టీ నేతలు మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తారు అనే సీఎం జగన్ తన తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారు అంటూ బీజేపీ కీలక నేత, ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. కరోనా వైరస్ పేరుతో జగన్ ఇక్కడికి రాకుండా తప్పించుకున్నారు అని వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరకుపోయింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తే కేసులు పెట్టీ బెదిరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే వివేకా హత్య కేసు దర్యాప పై ప్రశ్నించిన ఆయన కూతురు సునీత పై కేసు పెట్టగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ప్రచారం లో భాగం గా బీజేపీ కీలక నేతలు పాల్గొంటారు అని చెప్పుకొచ్చారు. అయితే ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యల పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.