దుబ్బాకలో బీజేపీదే గెలుపు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..!

Wednesday, November 4th, 2020, 01:03:23 AM IST

దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు బీజేపీదే అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో భారీగా పోలింగ్ శాతం నమోదైందని, టీఆర్‌ఎస్‌ నేతలు ఓటుకు 5 నుంచి 10 వేల వరకు పంచారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా దుబ్బాకలో గెలుపు మాత్రం బీజేపీదే అని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కూడా బీజేపీనే అని అన్నారు.

అంతేకాదు దుబ్బాకలో పోలింగ్ శాతం పెరగడం బీజేపీకి సానుకూల అంశమని అన్నారు. టీఆర్ఎస్ అబద్ధాలను ప్రచారం చేసి మరోసారి గెలవాలని చూశారని కానీ దుబ్బాక ప్రజలు ఈసారి టీఅర్ఎస్ నేతల మాయ మాటాలను నమ్మలేదని బండి సంజయ్ అన్నారు. ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసుకుంటే పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థ బీజేపీది విజయమని తేల్చగా, మరో ఎగ్జిట్ పోల్ సంస్థ థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ (నాగన్న) టీఆర్ఎస్‌దే విజయమని తేల్చింది.