విజయశాంతిపై ఎంపీ బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Tuesday, November 3rd, 2020, 05:04:39 PM IST

తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న రాములమ్మ తిరిగి బీజేపీలో చేరబోతున్నారని కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో బండి సంజయ్ మీడియా ముందు విజయశాంతి గురుంచి మాట్లాడుతూ ఆమెపై పొగడ్తలు కురిపించారు.

అయితే విజయశాంతి ప్రజాదరణ ఉన్న నాయకురాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలకంగా వ్యవహరించారని, తెలంగాణ గ్రామాల్లో ప్రజలను ఆమె ఎంతో చైతన్యం చేశారని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విజయశాంతిని అన్ని పార్టీలు నిర్లక్ష్యం చేశాయని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా విజయశాంతి బీజేపీలో చేరికపై జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.