ఏ హక్కుతో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు – ఎంపీ అరవింద్

Tuesday, February 9th, 2021, 03:00:39 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎంగా కేసీఆర్ కొనసాగాలని ఒకవేళ మార్పు జరిగితే ఈటల్ రాజేందర్‌కు ఆ పదవి అప్పచెపాలని అన్నారు. సీఎం‌ కేసీఆర్‌పై పార్టీ నేతల్లోనే విశ్వాసం సన్నగిల్లడం, కుటుంబం‌పై నమ్మకం పోయిందని అందుకే ఈటలకు అవకాశం కల్పించాలని అన్నారు. పార్టీలో వ్యతిరేక గళం వినిపిస్తున్నారన్న భయంతో ఎమ్మెల్యేలపై కేసీఆర్ బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించారు.

అయితే అసలు ఏ హక్కుతో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని దీనిపై గవర్నర్‌ కు ఫిర్యాదు చేసినట్లు అర్వింద్ చెప్పుకొచ్చారు. అసలు సీఎం మార్పుపై కేటీఆర్ చెబితేనే ఎమ్మెల్యేలు అలా మాట్లాడారని అలాంటప్పుడు తిట్టాల్సింది కేటీఆర్‌ను అని అన్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, అంతకు ముందు జరిగే ఉపఎన్నికల్లోపే ప్రజలు సీఎం కేసీఆర్‌ను బండకేసి కొడుతారని అర్వింద్ చెప్పుకొచ్చారు.