కేటీఆర్‌ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు.. బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ప్రతిసవాల్..!

Thursday, February 25th, 2021, 01:12:50 AM IST


తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 1,32,799 ప్రభుత్వ రంగ ఉద్యోగాలిచ్చామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి ఏపీలో 2004-14 మధ్య అప్పటి ప్రభుత్వాలు కేవలం 10 వేల ఉద్యోగాలే ఇచ్చారని ఏ ప్రభుత్వాలు చేయనన్ని ఉద్యోగ నియామకాలు తాము చేశామని ఉద్యోగాలపై చర్చకు ఎక్కడైనా సిద్ధం అని ప్రకటించారు. అయితే కేటీఆర్ చెబుతున్న ఉద్యోగాలు ఎక్కడ కల్పించారో చెప్పాలని కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్‌ అన్నారు. ఈ నెల 26న మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్క్ వద్ద ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.

ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు కూడా మంత్రి కేటీఆర్‌కు ప్రతిసవాల్ విసిరారు. కేటీఆర్‌ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అని తాను లైవ్ చర్చకు సిద్ధమని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీ ముందు చర్చించే దమ్ము కేటీఆర్‌కు ఉందా అని నిలదీశారు. ఐటీఐఆర్ విషయంలో మీ అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా బయటపడ్డాయని, ఎయిమ్స్‌కి ల్యాండ్ ఇవ్వడం లేదు.. ఎంఎంటీఎస్ వాటా ఇవ్వడంలేదు.. కేంద్రం నుంచి వస్తున్న విధుల గురించి చెప్పడం లేదని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఫైర్ అయ్యారు.