పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లో అవినీతి జరిగింది – బీజేపీ ఎమ్మెల్సీ

Sunday, October 25th, 2020, 02:40:03 PM IST


గత ప్రభుత్వం టీడీపీ హయం లో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం లో అవినీతి జరిగింది అని బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ పై ఘాటు విమర్శలు చేసిన మాధవ్ మరోమారు పోలవరం ప్రాజెక్టు విషయం లో టీడీపీ పై ఘాటు విమర్శలు చేశారు. తెలుగు దేశం పార్టీ అధికారం లో ఉండగా, టెక్నాలజీ పేరుతో పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచేశారు అని ఆరోపించారు. అయితే ప్రాజెక్ట్ అంచనాల పెంపు పై విచారణ జరిపించాలి అనిఈ మేరకు మాధవ్ డిమాండ్ చేశారు.

అయితే 2013 లో ఎంత రీహాబిలిటేషన్ అవుతుంది అని చెప్పారో, 2015 కల్లా దాని అంచనా పెరిగిందని, దాని పై విచారణ జరగాలి అని, గతంలో నితిన్ గడ్కారీ కి ఫిర్యాదు చేశామని ఈ మేరకు మాధవ్ గుర్తు చేశారు. అయితే పోలవరం ప్రాజెక్టు విషయం లో డీపీ ఆర్ 1,2 లకు సంబంధించి ఎంత అయితే అంచనాలు ఇస్తారో అవి వందకు వంద శాతం చేస్తామని గతంలో ఉమా భారతి, నితిన్ గడ్కారీ, నేటి జల వనరుల శాఖ మంత్రి హామీ ఇచ్చారు అని స్పష్టం చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఖర్చు కేంద్రం భరిస్తుంది అని, పోలవరం పై వస్తున్న వాదనలు అన్నీ కూడా ఊహాగానాలే అని తెలిపారు.